జెస్సీకి జర్నలిస్టుల ఘన నివాళి

ఇటీవల మరణించిన సీనియర్‌ క్రీడా జర్నలిస్టు జె.శ్రీనివాసులుకు ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, శాట్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, జర్నలిస్టులు ఆత్మీయ నివాళులు అర్పించారు. తెలుగు క్రీడా జర్నలిజానికి చక్కని గుర్తింపు తెచ్చిన జెస్సీ సేవలను కొనియాడారు. జెస్సీ కుటుంబాన్ని ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతామన్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో జరిగిన జెస్సీ సంతాప సభకు ఆయన కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు హాజరయ్యారు. అతనితో తమకున్న ఆత్మీయతను గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.