జూ. లెక్చరర్ల సమ్మెపై ఇంటర్ బోర్డ్ సీరియస్

ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు వెంటనే విధుల్లోకి చేరాలని, లేదంటే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను ఇంటర్ బోర్డ్ కమిషనర్ ఏ అశోక్ ఆదేశించారు. అధ్యాపకుల సర్వీసులను త్వరలోనే క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు రూ.18 వేల నుంచి రూ.27 వేలకు పెంచామన్నారు. అందుకు సంబంధించి గత డిసెంబర్ 24న జీవో 409ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అధ్యాపకుల కోసం ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంటే.. వారు మాత్రం సమ్మె చేయడం సరైన పద్దతికాదన్నారు. ఈనెల 12లోగా విధుల్లోకి చేరని కాంట్రాక్ట్ అధ్యాపకులకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు.