కరీంనగర్ లోజాతీయ స్ధాయి ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం

కరీంనగర్ లో జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్ ఈ పోటీలను ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి ఆరు రోజుల పాటు కొత్తపల్లి అల్ఫోర్స్ పాఠశాలలో ఫెన్సింగ్ పోటీలు జరుగుతాయి. అండర్-17 బాలబాలికల విభాగంలో 15 రాష్ట్రాలకు చెందిన 315 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఐడీసీ చైర్మెన్ ఈద శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.