ఐసిస్‌పై పోరులో రష్యాతో కలిసి పనిచేస్తాం

ఐసిస్‌పై పోరులో రష్యాతో కలిసి పనిచేస్తామని అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ప్రకటించారు.  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలుపొందిన తర్వాత ఆయ‌న‌ తొలిసారిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. రష్యాతో తనకు ఆర్థికపరమైన లావాదేవీలేమీ లేవని ట్రంప్‌ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తనను ఇష్టపడితే అది మంచిపరిణామమేనని వ్యాఖ్యానించారు. దేశంలో పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఆటోమొబైల్‌, ఫార్మా రంగాలపై దృష్టిపెట్టనున్నట్టు ట్రంప్ చెప్పారు.