ఐదు రాష్ట్రాల ఎన్నికలకు బీజేపీ కసరత్తు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అరుణ్‌ జైట్లీ, రాజ్‌ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. త్వరలో ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగనుండడంతో.. అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. దాంతో పాటు సీఎం అభ్యర్థుల ఎంపికపై కూడా డిస్కస్‌  చేసినట్లు సమాచారం.