ఉత్సాహంగా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్

ఆల్‌ ఇండియా ఫారెస్ట్‌ స్పోర్ట్స్‌ మీట్ హైదరాబాద్‌ లో ఉత్సాహంగా  కొనసాగుతోంది. గచ్చిబౌలి జీఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతున్న  క్రీడోత్సవాల్లో పలు రాష్ట్రాలకు చెందిన ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. మహిళలు, పురుషుల విభాగంలో లాంగ్‌ జంప్‌, హై జంప్‌, రన్నింగ్‌ వంటి వివిధ పోటీల్లో తలపడుతున్నారు. ఇప్పటి వరకు ముగిసిన పోటీల్లో కర్ణాటక టీమ్‌ 16 గోల్డ్‌, 13 సిల్వర్‌ మెడల్స్‌ సాధించి ఫస్ట్‌ ప్లేస్‌ లో నిలిచింది. తెలంగాణ టీమ్‌ 4 గోల్డ్‌ మెడల్స్, 6 సిల్వర్‌ మెడల్స్‌ తో 4వ స్థానంలో నిలిచింది. ఫారెస్ట్ నేషనల్ స్పోర్ట్స్ మీట్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల రుపాయలు కేటాయించింది. రేపటితో క్రీడోత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు చెప్పారు.