బాధపడి ఏం లాభం!

హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం వెండితెర మీద తన మెరుపులు మెరిపిస్తోంది. సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌లు చేస్తూ, స్పెషల్‌ రోల్స్‌లో కనిపిస్తూ చాలా బిజీబిజీగా గడిపేస్తోంది. అయితే కొద్ది రోజులుగా అనసూయ ఓ విషయంలో తెగ బాధపడిపోతోంది. మెగాస్టార్‌ కమ్‌బ్యాక్‌ మూవీ ‘ఖైదీ నెంబర్‌ 150’కి సంబంధించి ఓ మంచి అవకాశాన్ని జారవిడుచుకోవడమే ఆ బాధకు కారణమట. ఇటీవల జరిగిన ‘ఖైదీ నెంబర్‌ 150’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ కు సుమ యాంకరింగ్ చేసింది. అయితే ఈ యాంకరింగ్‌ ఛాన్స్‌ మొదట అనసూయకే వచ్చిందట. “జనవరి 4న జరగాల్సిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు నేనే యాంకరింగ్‌ చేయాలి. కానీ, అనుకోకుండా ఆ కార్యక్రమం జనవరి 7కు వాయిదా పడింది. చరణ్‌ సిబ్బంది నాకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. అయితే అప్పటికే ఆ కాల్షీట్‌ నేను వేరే వారికి ఇచ్చేశాను. అందుకే ఈ ప్రెస్టేజియస్‌ ఈవెంట్‌ను మిస్సయ్యాను” అని అనసూయ బాధపడింది.