ఆలిండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

హైదరాబాద్ గచ్చిబౌలి  స్టేడియంలో 23వ ఆలిండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు కేటీఆర్, జోగు రామన్న స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని తీసుకొచ్చారని మంత్రి జోగు రామన్న చెప్పారు. అటవీ శాఖ సిబ్బందికి కొత్త వాహనాలను సమకూర్చారని తెలిపారు. ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ కు 5 కోట్ల రూపాయలు కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు మంత్రి జోగు రామన్న కృతజ్ఞతలు తెలిపారు.

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, క్రీడలు, అటవీ శాఖ ఉన్నతాధికారులు, వందలాది మంది అటవీశాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.