అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే బుద్ధిచెబుతారు

బంగారు తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటే విపక్షాలకు ప్రజలే బుద్ధిచెప్తారని టీఆర్‌ఎస్ నేత నోముల నర్సింహయ్య అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు యాత్ర పేరుతో ఒకరు, తెలంగాణ అభివృద్ధికి కొత్త నమూనా ఇస్తామని కొందరు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసమే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. విద్య, అభివృద్ధి, ఇతర అంశాల్లో సూచనలు చేస్తే తమ ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు.