సీఎం కేసీఆర్‌కు దాసరి కృతజ్ఞతలు

తెలంగాణకు హరితహారం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకుగాను పెద్దపల్లి నియోజకవర్గానికి పదికోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్ లో  సిఎంను ఆయన కలిశారు. ప్రత్యేకంగా విడుదల చేసిన పదికోట్ల రూపాయలను కూడా నియోజకవర్గంలో పచ్చదనం పెంచడానికే వినియోగించాలని సిఎం సూచించారు.