భారత సైన్యం పనితీరు భేష్

భారత్ ను ప్రత్యక్షంగా ఏమీ చేయలేని పాకిస్థాన్ఉ గ్రవాదాన్ని ప్రోత్సహించి మన దేశాన్ని దెబ్బతీయాలని చూస్తోందన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్. పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే సవాళ్లను భారత సైన్యం ధీటుగా ఎదుర్కుంటోందన్నారు. భారత సైన్యంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడులకు సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో సమాధామిచ్చామన్నారు. ఎవరి ముందు భారత్ తల వంచబోదని, సర్జికల్ స్ర్టైక్స్ సమయంలో భారత సైన్యం అద్భుత ప్రతిభ కనబర్చిందన్నారు. జమ్మూకాశ్మీర్ లో జరిగిన షహీద్ దివస్ లో రాజ్‌ నాథ్ పాల్గొన్నారు.