ప్రజలపై ఇంకెంతకాలం ప్రయోగాలు!?

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా తీవ్రంగా విమర్శించారు. దాదాపు 42 రోజుల తర్వాత ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఫేస్ బుక్‌ లో పోస్ట్ పెట్టారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై కేంద్రం వద్ద గానీ, ఆర్.బి.ఐ వద్ద గానీ ఎలాంటి ప్లాన్లు లేవని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపైన ప్రయోగాలు చేస్తోందని, ఇంకెంతకాలం ఈ ప్రయోగం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఒకేసారి 5 వేల రూపాయల కన్నా ఎక్కువ మొత్తాన్ని జమ చేయాలనే నిర్ణయంతో కేంద్ర ఆర్థిక సంస్థ ఇక విచారణ సంస్థగా మారినట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్‌ పిచ్చి చర్యల కారణంగా అమాయకులైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాబర్ట్‌ వాద్రా ఆవేదన వ్యక్తం చేశారు.