అవినీతి నిర్మూలనలో మొదటి అడుగు

పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన నిర్ణయమని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కరెన్సీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అవినీతి నిర్మూలనకు మొదటి స్టెప్‌ అని చెప్పారు. నోట్ల రద్దు అమలుచేయడానికి ఎంతో శక్తి సామర్థ్యాలు కావాలన్నారు. ఫిక్కీ 89వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మార్కెట్లోకి అవసరమైన నగదును తీసుకురావడానికి వీలైనంత కృషి చేస్తున్నామన్నారు. దీర్ఘకాలంలో నోట్ల రద్దు నిర్ణయం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.