త్వరలో పూర్తిగా డిజిటల్ విధానంలోకి రాష్ట్రం. అందరూ డిజిటల్ లావాదేవీలు అలవాటు చేసుకోవాలన్న సీఎం కేసీఆర్. డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రం నంబర్ వన్ గా నిలవటంపై హర్షం. డిజిటల్ లావాదేవీలకు సహకరించేందుకు ముందుకొచ్చిన ఐసిఐసిఐ. కలెక్టర్ల సమావేశంలో టిఎస్ వాలెట్ ప్రారంభించాలని……

ప్రస్తుతం అత్యధికంగా డిజిటల్ ఆర్థిక లావాదేవీలు నడుస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలవటంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రం పూర్థి స్థాయి డిజిటల్ విధానంలోకి మారి, నగదు రహిత ఆర్థిక లావాదేవీలు జరిపే రాష్ట్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చి, ప్రజలకు సేవలు అందించడానికి బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ

ఇక సెలవు!…

Jayaram Jayalalitha

తమిళ ఐరన్ లేడీ అంత్యక్రియలు చెన్నైలో ముగిశాయి. పురచ్చి తలైవి జయలలితకు లక్షలాది మంది ప్రజలు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. ఇసుకేస్తే రాలనంత జనంతో మెరీనా బీచ్ మరో సంద్రమైంది. జయ చివరి కోరిక మేరకు మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ మెమోరియల్ పక్కనే ఆమెను సమాధి చేశారు. జయ నెచ్చెలి శశికళ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. త్రివిధ దళాలు గౌరవ వందనం అనంతరం అమ్మను బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారంRead More

సుప్రీం కొత్త చీఫ్ జస్టిస్ ఖెహర్

justice-js-kheharసుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జగదీశ్ సింగ్ ఖెహర్ నియామకం ఖరారైంది. వచ్చే నెల 4న ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ పదవిలో ఆయన ఆగస్ట్ 4, 2017 వరకు.. అంటే సరిగ్గా ఎనిమిది నెలలు కొనసాగుతారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ పదవీకాలం వచ్చే నెల 3తో ముగుస్తుంది. జస్టిస్ జేఎస్ ఖెహర్ పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఠాకూర్Read More

అమ్మకు కన్నీటి వీడ్కోలు

jaya-last-journeyతమిళనాడు దివంగత సీఎం జయలలిత అంతిమయాత్ర లక్షల జనం మధ్య జరిగింది. జయ పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్ వరకు అంతిమయాత్ర సాగింది. కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో.. రాజాజీ హాల్ దగ్గర త్రివిధ దళాల సైనికులు జయ భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంపైకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సైనికులు, పోలీసుల కవాతు మధ్య అంతిమయాత్ర సాగింది. అమ్మ అంతిమయాత్రRead More

జయకు రాష్ట్రపతి ప్రణబ్, రాహుల్ నివాళులు

pres-rahul-trib-to-jayaతమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. చెన్నైలోని రాజాజీ హాల్ లో ఉంచిన జయ పార్థివదేహాన్ని సందర్శించి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కేరళ గవర్నర్ సదాశివం, ముఖ్యమంత్రి విజయన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్ తదితరులు జయకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.Read More

రాజకీయ గురువు సమాధి పక్కనే..!

preps-at-merina-beachజయలలిత అంత్యక్రియలకు చెన్నైలోని మెరీనా బీచ్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జయ రాజకీయ గురువు, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ పరిసరాల్లో మొత్తం భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. అమ్మ అంత్యక్రియలను దూరం నుంచి కూడా చూసేందుకు సిద్ధం చేశారు. సాయంత్రం నాలుగున్నరకు రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్ కు జయ పార్థివ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. జయ అంత్యక్రియలుRead More